Sunday, 02 August 2026 07:03:23 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టాలి – జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 05 April 2026 06:06 PM Views : 164

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో డా. బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్, భద్రాద్రి కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, డా. బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డా. బాబూ జగ్జీవన్ రామ్ దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం విశిష్ట సేవలు అందించి, సామాజిక న్యాయ సాధనకు కృషి చేసిన మహానేత అని కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, ఉన్నత స్థాయికి ఎదగాలంటే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంలో అనేక శాఖలకు మంత్రిగా సేవలందించడమే కాకుండా దేశ ఉప ప్రధానిగా కూడా సమర్థవంతంగా పనిచేసి ప్రజాసేవకు అంకితభావంతో నిలిచారని తెలిపారు.మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజంలో వివక్ష లేకుండా సమానత్వంతో ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణు గోపాల్, కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఐ నాయకులు సాబీర్ పాషా, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎం. శ్రీలత, జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ దాసరి శ్రీనివాస్, కో-కన్వీనర్లు చదలవాడ సూరి, కూసపాటి శ్రీనివాస్, మంద హనుమంతు, మద్దెల సూరి తదితరులు, శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :