తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చుంచుపల్లి మండలం పరిధిలోని బైపాస్ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. డ్రైనేజీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ