Monday, 02 November 2026 06:15:28 PM
# అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

కరకగూడెం, ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను సందర్శించి తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Date : 23 October 2026 05:40 PM Views : 153

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కరకగూడెం, ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను సందర్శించి తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి అని అధికారులకు ఆదేశాలు.ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, కార్యాలయ నిర్వహణ, రికార్డులు, స్టేషన్ ప్రాపర్టీ, ఆయుధాల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణతో పాటు సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. విధి నిర్వహణకు అవసరమైన కిట్ ఆర్టికల్స్‌ను సక్రమంగా నిర్వహించుకోవాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ దర్యాప్తుల పురోగతి, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.పోలీస్ స్టేషన్‌కు వివిధ సమస్యలతో వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలపై తక్షణమే స్పందించి త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లోని ఆయుధాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ సక్రమంగా నిర్వహించాలని, స్టేషన్ ప్రాపర్టీకి సంబంధించిన రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తూ వాటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు విధుల నిర్వహణలో క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పనితీరును కనబరచాలని సూచించారు.సీసీటీఎన్‌ఎస్‌ 2.0లో కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి తదితర సమాచారాన్ని సకాలంలో నమోదు చేయాలని, ప్రతి ఒక్కరూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా గ్రామాల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.జూదం, కోడిపందాలు, పేకాట, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిస్థాయిలో అరికట్టాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను సందర్శించి, అక్కడ నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ, సిబ్బందికి మెరుగైన పని వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, సిఐ నాగబాబు, ఎస్సై పి.వి.ఎన్. రావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :