తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్వచ్చ భారత్ డ్రైవర్లు,హెల్పర్లకు జీతాలు ఇవ్వాలి.. ఈనెల 22న స్వచ్ఛ భారత్ డ్రైవర్లు,హెల్పర్ల సమస్యలపై దీక్ష .. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్. పాల్వంచ మున్సిపాలిటీలో కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న స్వచ్చ భారత్ డ్రైవర్లు,హెల్పర్లకు మున్సిపాలిటీ ద్వారా జీతాలు ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ స్వచ్చ భారత్ డ్రైవర్లు హెల్పెర్ల తో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి అనంతరం కలెక్టర్ జీతేష్.వి.పాటిల్ కు వినతి పత్రం అందజేశారు.ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ స్వచ్చ భారత్ డ్రైవర్లు,హెల్పర్ల జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని,అన్ని మున్సిపాలిటీలలో మున్సిపాలిటీ ద్వారా జీతాలు చెల్లిస్తూ పాల్వంచలో మాత్రం ఇంటింటికీ నెలకు రూ.50 వసూలు చేసుకొని డబ్బులు తీసుకోమనగా చాలా మంది ఇంటి యజమానులు డబ్బులు ఇవ్వక కొంతమంది ఇచ్చిన వారి కనీస అవసరాలకు సరిపోవడం లేదని,కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.స్వచ్చ భారత్ డ్రైవర్లు,హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 22వ తేదీన మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,కాకటి హుస్సేన్,రాయల పార్వతి,బత్తుల వెంకటేశ్వరమ్మ,దేవాళ్ళ రమణ,వేముల రమణ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ