తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల చైతన్య ప్రకాష్ అనే వ్యక్తికి జరిగిన దవడ ఆపరేషన్ విజయవంతమైంది. సుమారు 20 రోజుల క్రితం పని చేస్తుండగా కింద పడిపోయిన చైతన్య దవడ ఎముక విరిగింది. డాక్టర్ వంశీ కృష్ణ నేతృత్వంలో దవడకు శస్త్రచికిత్స చేసి, ప్లేట్లు అమర్చారు. లక్ష రూపాయల విలువైన ఈ ఆపరేషను ఎటువంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించడం విశేషం.
Admin
తెలుగు వెలుగు టీవీ