Wednesday, 16 September 2026 10:47:54 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

సింగరేణి నూతన అధికారులను కలిసి సన్మానించిన కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ నాయకులు.

Date : 11 August 2026 06:43 PM Views : 413

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి.సింగరేణి నూతన అధికారులను కలిసి సన్మానించిన కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ నాయకులు.సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ప్రత్యేక చొరవ చూపాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు.కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి కార్మికుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆధ్వర్యంలో నాయకులు జీఎం పర్సనల్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కిరణ్‌కుమార్‌, జీఎం అజయ్‌కుమార్‌, జీఎం ఎడ్యుకేషన్‌ గడిపెల్లి రాజేంద్రప్రసాద్‌లను కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు యాజమాన్యం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కొత్తగూడెం ఏరియాలో కార్మికులకు సంబంధించిన పలు సమస్యలు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వేగంగా పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, పరిష్కారం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతోందని నాయకులు పేర్కొన్నారు.కార్మికులకు న్యాయం జరిగేలా యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిశీలించి పరిష్కరిస్తే సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు కార్మికుల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు.కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులు కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్‌ అంశాలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్‌, కేంద్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వీరస్వామి, కొత్తగూడెం ఏరియా బ్రాంచ్‌ కార్యదర్శి జె. గట్టయ్య, భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మోటపాలకుల రమేష్‌, కార్పొరేట్‌ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి,సత్తుపల్లి కార్యదర్శి సముద్రాల సుధాకర్ కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షులు కత్తెర్ల రాములు, ఆఫీస్‌ బేరర్లు సందేబోయిన శ్రీనివాస్‌, ఎస్‌. నాగేశ్వరరావు, గుమ్మడి వీరయ్య, హీరాలాల్‌, పిట్‌ కార్యదర్శులు మధుకృష్ణ, కమల్‌, ఎం.ఆర్‌.కె. ప్రసాద్‌, సురేందర్‌, నాయకులు మెంగన్‌ రవి రాజకుమార్,భరణి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :