తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 6 తెలుగు వెలుగు)జూలూరుపాడు మండల కేంద్రంలో బిజెపి 45వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ బీజేపీ జెండా ఎగరవేసినారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ ఆరో తారీఖున అటల్ బిహారీ వాజ్పేయి మరియు లాల్ కృష్ణ అద్వానీ నేతృత్వంలోని పార్టీని స్థాపించబడింది. ప్రథమసారి నిలబడినప్పుడు దేశంలో రెండు పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నది, ఆ తర్వాత అంచలంచలా ఎదుగుతూ కేంద్రంలో అధికారం చేపట్టినది, వాజ్పేయి ఆరు సంవత్సరాలు పాటు ప్రధాన మంత్రిగా కొనసాగినారు, నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పూర్తి చేసుకున్న తర్వాత మూడోసారి కూడా ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు, ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారంతో పాటు 22 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉన్నది. నీతి నిజాయితీతో పని చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికల జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, బిజెపి జిల్లా నాయకులు నున్న రమేష్, అన్నవరపు సత్యనారాయణ, మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, తెల్లం నరసింహారావు, భూక్య రమేష్, భూక్య రవి, నిమ్మటూరి రామారావు, రాంబాబు, సిరిపురపు గోపాలరావు, నర్వనేని కృష్ణ, పురేటి వెంకటేశ్వర్లు, పురేటి శ్రీను చిలుకూరి కిరణ్, వందనపు సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ