Saturday, 19 September 2026 05:54:35 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

Date : 02 September 2024 09:22 PM Views : 694

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు...... ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు.... *జూలూరుపాడు మండలం మాచినపేట గ్రామానికి చెందిన బి.ప్రవీణ్ అమ్మానాన్నను చిన్నప్పుడే చనిపోయినందున ఇంటర్ వరకు చదువుకున్న తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అట్టి దరఖాస్తును పరిశీలించి జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ కు ఎండార్స్ చేశారు.... *రుద్రంపూర్ కు చెందిన జోగు చంద్రావతి వికే -7 వల్ల తమ ఇల్లు కూల్చివేశారని, 100 గజాల స్థలం ఇచ్చారని, ఇల్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ ఇల్లు పథకంలో అవకాశం కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ హౌసింగ్ శాఖకు ఎండార్స్ చేశారు... *పాల్వంచ నవభారత్ పాఠశాల, గాంధీ నగర్ ఏరియా చెందిన విద్యార్థులు స్థానికులు తమ ఏరియాలో కోతులు బెడద అధికంగా ఉందని వీటి విషయంలో, తాము ఇబ్బందులు పడుతున్నామని వినతిపత్రం అందజేయగా దరఖాస్తును పరిశీలించి సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు.... *చర్ల మండలం ఎర్రంపాడు, కిష్టారాంపాడు, బూరుగుపాడు గ్రామాలకు చెందిన మూల ఆదివాసీలు కొందరు రాజ్యాంగ పరంగా ఇస్తున్న ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు తమకు నిలిపివేశారని, అన్యాయం జరుగుతుందని హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు తమకు కోయ కుల ధ్రువీకరణ పత్రాలు పునరుద్ధరించాలని కలెక్టర్ కోరగా సంబంధిత శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు... *చుంచుపల్లి మండలం రుద్రంపూర్ ఎస్ఆర్ టి ఏరియా కు చెందిన పూసల రఘు వికే-7 మైన్ వల్ల తమ ఇళ్లను అధికారులు కూల్చివేశారని,గంగా హుస్సేన్ బస్తీలో 100 గజాల స్థలాన్ని కేటాయించారని అందుకు సంబంధించి తమకు ఇల్లు కట్టుకోలేము కాబట్టి ఐదు లక్షల ఆర్థిక సాయం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇప్పించాలని కలెక్టర్ ను కోరారు. సంబంధిత దరఖాస్తును పరిశీలించి కలెక్టర్ హౌసింగ్ శాఖకు ఎండార్స్ చేశారు... ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్డీఓ విద్యా చందన,వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు....

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :