Thursday, 17 September 2026 05:09:53 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఆధునిక హంగులతో కొత్త బస్టాండ్లు. ప్రయాణికులకు మెరుగైన వసతులు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 06 September 2026 05:13 PM Views : 143

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆధునిక హంగులతో కొత్త బస్టాండ్లు.సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళిక. ప్రయాణికులకు మెరుగైన వసతులు.నియోజకవర్గ నిధుల నుంచి రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నా.త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి.ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.ఎన్నో ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న బస్టాండ్లను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్ది, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా సాగుతున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం రాత్రి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్‌తో కలిసి ఆయన కొత్తగూడెం బస్టాండ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో నెలకొన్న అధ్వాన పరిస్థితులను, వర్షాకాలంలో ప్రయాణికులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను ఉన్నతాధికారులకు కూనంనేని స్వయంగా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన భవన నిర్మాణం కోసం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీఎఫ్) నుంచి తక్షణమే రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగూడెం బస్టాండ్ సమగ్ర ఆధునికీకరణకు రూ.20 కోట్లు, పాల్వంచ బస్టాండ్‌ను నూతనంగా నిర్మించేందుకు మరో రూ.10 కోట్లతో సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఆర్టీసీ నిధులు సైతం జోడించి దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో ఈ రెండు బస్టాండ్లను మోడ్రన్ హంగులతో పునర్నిర్మించేందుకు కసరత్తు వేగవంతం చేశామని తెలిపారు. అధికారులు ఎలాంటి జాప్యం లేకుండా పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుంచి నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు సకల సదుపాయాలు అందేలా పనుల్లో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్, ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు కందుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :