Friday, 18 September 2026 07:20:05 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.

Date : 24 July 2026 06:19 PM Views : 130

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పంటల వైవిధ్యీకరణతో రైతులకు భరోసా కల్పించాలి. ఎంఎస్పీపై అపోహలు తొలగించి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి.జిల్లాల్లో అత్యవసర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంగా ఉంచాలి.రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ఆదేశించారు.శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల వైవిధ్యీకరణ, సంక్షేమ వసతి గృహాల నిర్వహణ, పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్ ధోరణులను దృష్టిలో ఉంచుకుని పంటల వైవిధ్యీకరణను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. గత కొన్ని రోజులుగా భారత వాతావరణ శాఖ అంచనాలు నిజమవుతున్నాయని, ప్రస్తుత పరిస్థితులు త్వరలో మెరుగుపడే అవకాశాలు తక్కువగా ఉన్నందున అధికారులు ఎలాంటి జాప్యం లేకుండా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రైతుల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు పరిస్థితులకు అనుగుణంగా అవగాహన కల్పించాలని సూచించారు.కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై రైతుల్లో ఉన్న అపోహలను పూర్తిగా తొలగించాలని, దేశవ్యాప్తంగా దాదాపు 20 పంటలకు ఎంఎస్పీ అమలులో ఉందని వివరించాలని పేర్కొన్నారు. కేవలం వరికే మద్దతు ధర ఉంటుందనే భావన సరైంది కాదని, పత్తి సహా అనేక పంటలకు ఎంఎస్పీ వర్తిస్తుందని తెలిపారు. మార్కెట్ ధర ఎంఎస్పీ కంటే తగ్గినప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు స్పష్టంగా తెలియజేసి ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల రైతుల ఆదాయం తగ్గుతుందనే అభిప్రాయం సరికాదని, అనేక సందర్భాల్లో మరింత అధిక ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ప్రాంతానికి అనువైన పంటల సాగుపై రైతులకు మార్గనిర్దేశం చేయాలని, సాగు విధానాల్లో అవసరమైన మార్పులు తీసుకురావాలని అధికారులకు సూచించారు.ప్రతి జిల్లాలో ఎల్‌నినో పరిస్థితులకు అనుగుణంగా అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి వెంటనే అమలు చేయాలని, అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్లు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే రిజర్వాయర్లలో నీటి నిల్వలను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.జిల్లా ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లాలో పంటల వైవిధ్యీకరణ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై ఎలాంటి అపోహలు లేకుండా స్పష్టమైన సమాచారం అందించాలని తెలిపారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్లు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మిషన్ భగీరథ ఈఈ నలిని, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :