తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హాజరైన ఎమ్మెల్యే కూనంనేని, SP రోహిత్ రాజు,టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు. కొత్తగూడెంలో వినాయక చవితి ఉత్సవ కమిటీ, ఉత్సవ సమితి, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో జరిగిన గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, SP రోహిత్ రాజు,టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు హాజరై గణనాధులకు పూజలు చేసి వీడ్కోలు పలికారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం ఎంతో శోభయమానం చేకూరింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణనాథడు మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, భజనలు, నృత్యాల మధ్య శోభాయాత్రగా తరలి వెళ్తున్న దృశ్యం చూస్తుంటే కన్నుల పండుగలా ఉందన్నారు. గతంలో కంటే ఈసారి గణేష్ మండపాల సంఖ్య పెరిగిందన్నారు. చిన్న పిల్లలు కూడా గల్లి గల్లికో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఉత్సవాలను నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న కమిటీ నిర్వాహకులు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదములు చెప్పారు .ఈ కార్యక్రమములో ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, దారా రమేష్,గౌరవ అధ్యక్షులు kV.రంగాకిరణ్, కంచర్ల చంద్రశేఖర్, బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ,జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి. వీరబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోనేరు చిన్ని,దేవి ప్రసన్న,ఆళ్ళ. మురళి , కమిటీ నిర్వాహకులు, పట్టణ ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ