Wednesday, 16 September 2026 06:52:45 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

శ్రీ పాండురంగ భజన మందిరంలో ఘనంగా ఉపాలయాల ప్రతిష్ఠా మహోత్సవం.

Date : 23 August 2026 06:45 PM Views : 313

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దేవాదాయ ధర్మాదాయ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం పట్టణంలోని శ్రీ పాండురంగ భజన మందిరం ప్రాంగణంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారు, శ్రీ పార్వతీదేవి అమ్మవార్ల ఉపాలయాల ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు ఆగస్టు 19 నుండి 23వ తేదీ వరకు ఐదు రోజులపాటు పాంచాహ్నిక దీక్షాపూర్వకంగా వైభవంగా నిర్వహించారు.ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా ఆగస్టు 23వ తేదీ ఆదివారం ఐదవ రోజు, చివరి రోజు కార్యక్రమాలు మంగళ వాయిద్యాలతో ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30 గంటల నుండి ప్రాతఃకాల యథావిధి అర్చనలు, అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం ఉదయం 10.30 గంటలకు మూర్తుల స్థానములు, గర్తన్యాసం, బీజ, ఓషధి, రత్నన్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11.25 గంటలకు మూలా నక్షత్ర యుక్త తులా లగ్నంలో యంత్ర, విగ్రహ స్థిర ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. మధ్యాహ్నం 1 గంటకు శాంతి కల్యాణం అనంతరం బలిహరణ, ధేను దర్శనం నిర్వహించి, అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం, ఆశీర్వచనం కార్యక్రమాలు నిర్వహించారు.ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలను బ్రహ్మర్షి శ్రీ చేబ్రోలు సుబ్రహ్మణ్య శర్మ గారు మరియు వారి బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఐదు రోజులపాటు జరిగిన ఈ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాల్లో ఆలయ ఈఓ, ఆలయ అర్చకులు, సిబ్బంది, ఆలయ నిర్మాణ దాతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ మహోత్సవంతో శ్రీ పాండురంగ భజన మందిరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :