తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 10 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామం నందు కోరమండల్ వారి మన గ్రోమోర్ ఆధ్వర్యంలో డీలర్ సాయి మహాలక్ష్మి ట్రేడర్స్ ప్రోప్రైటర్ కళ్యాణపు ప్రసాద్ ఉచిత కంటి పరీక్ష క్యాంప్ నిర్వహించారు. కాకర్ల గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నవారు ఈ ఉచిత కంటి పరీక్ష వైద్య శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి కంటి వైద్య నిపుణులు మందులతో పాటు కళ్ళ అద్దాలు అవసరం ఉన్నవారికి పది రోజుల్లో గ్రామపంచాయతీ వద్ద కళ్లద్దాలను ఉచితంగా ఇస్తామన్నారు. మన గ్రోమోర్ వారు ఇదే గ్రామంలో మహిళల కోసం ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు. ఈ ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులను వేశారు. ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ ముగ్గులను ఎంపిక చేసి వారికి బహుమతులు ఇచ్చారు. వారిలో మొదటి బహుమతి పోలూరి స్రవంతి, డిన్నర్ సెట్, రెండవ బహుమతి పోలూరి మీనా, డిన్నర్ సెట్, మూడవ బహుమతి చల్లా రేణుక హాట్ బాక్స్ అలాగే పాల్గొన్న ప్రతి మహిళకు ఒక బహుమతిని అందజేశారు. బహుమతుల ప్రధానం అనంతరం మన గ్రోమోర్ భద్రాద్రి కొత్తగూడెంజిల్లా రివిజినల్ మేనేజర్ సుమన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామానికి సంబంధించి పంటలలో దిగుబడులు పెంచే దానికి మన గ్రోమోర్ వారి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం, భూ పరీక్షలు, ఎరువుల వాడకం అలానే గ్రామానికి సంబంధించిన చిన్న చిన్న మౌలిక సదుపాయాల ఏర్పాటు కోరమండల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆదేశానుసారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కాకర్ల గ్రామాన్ని ఎంచుకున్నామని,త్వరలోనే ఈ గ్రామానికి మంచినీళ్ల సదుపాయం కొరకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. కళ్యాణపు ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని మా గ్రామాన్ని ఎంపిక చేసుకున్నందుకు కోరమండల్ కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బానోత్ బుల్లి, మాజీ ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్, పంచాయతీ సెక్రటరీ నాని బాబు, వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ