Thursday, 17 September 2026 06:10:25 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సికిల్‌సెల్, తలసేమియా రోగుల కోసం రెండు రోజుల ప్రత్యేక వైద్య శిబిరాలు - కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 27 November 2025 12:46 PM Views : 374

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సికిల్‌సెల్, తలసేమియా దీర్ఘకాలిక రక్తవ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం నవంబర్‌ 28–29, 2025 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలోని ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలన్న లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. రోగుల ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించడం, అవసరమైతే నిరంతర చికిత్సకు అనుసంధానం చేయడం, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం ఈ శిబిరాల ప్రధాన ఉద్దేశం అని కలెక్టర్ వెల్లడించారు.వైద్య శిభిరాలు క్రింద తెలిపిన విధంగా నిర్వహించబడతాయి:1. శుక్రవారం (28-11-2025) ఉదయం 8:00 – మధ్యాహ్నం 12:30 నర్సాపురం రైతు వేదిక, దుమ్ముగూడెం (దేవాలయం పక్కనే, ప్రధాన రహదారి, లక్ష్మీనగరం వైపు) 2. శుక్రవారం (28-11-2025) మధ్యాహ్నం 2:00 –సాయంత్రం 6:00భద్రాచలం రైతు వేదిక (మార్కెట్ యార్డ్‌లో) 3. శనివారం (29-11-2025) ఉదయం 8:00 – మధ్యాహ్నం 12:30అశ్వారావుపేట రైతు వేదిక(నారాయణపురం గ్రామపంచాయతీ కార్యాలయం పక్కన) నారాయణపురం గ్రామం, అశ్వారావుపేట మండలం.4. శనివారం (29-11-2025) మధ్యాహ్నం 2:00–సాయంత్రం 6:00 రామవరం రైతు వేదిక చుంచుపల్లి మండలం.హైదరాబాద్‌ నుండి ప్రత్యేకంగా రానున్న నిపుణులైన వైద్యుల బృందం ఈ శిబిరాల్లో రోగుల నిర్ధారణ, వైద్య సలహాలు, అవసరమైన చికిత్స పద్ధతులు వివరించనున్నారు. సికిల్‌సెల్, తలసేమియా రోగులకు మెడికల్ కార్డుల జారీ, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు (Unique disability id) నమోదు, కౌన్సిలింగ్ సేవలు పూర్తిగా ఉచితంగా అందించబడతాయని కలెక్టర్ తెలిపారు.ఇప్పటికే ఈ వ్యాధులు గుర్తించిన పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను సమీప శిబిరానికి తీసుకురావాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్యుల సూచనలు పొందాలని కోరుతూ, రోగుల ఆరోగ్య రక్షణలో ప్రతి కుటుంబం చురుకైన పాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :