Wednesday, 16 September 2026 09:17:08 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

జిల్లాలో సోలార్ విద్యుత్ విస్తరణకు చర్యలు వేగవంతం చేయాలి – టీజీ రెడ్‌కో ఛైర్మన్ ఎ. శరత్ .

Date : 13 November 2025 08:29 PM Views : 325

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో సోలార్ విద్యుత్ విస్తరణకు చర్యలు వేగవంతం చేయాలి అని టీజీ రెడ్‌కో ఛైర్మన్ ఎ. శరత్ అన్నారు.ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం, తెలంగాణ రాష్ట్ర పునరుత్పత్తి శక్తి అభివృద్ధి సంస్థ (TGREDCO) ఛైర్మన్ ఎ. శరత్, ఐఏఎస్ (రిటైర్డ్) ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల స్థాపన మరియు సౌర శక్తి వినియోగంపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా సౌర విద్యుత్ వినియోగ విస్తరణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యవసాయ పంపులు మొదలైన చోట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని కలెక్టర్ తెలిపారు.ఛైర్మన్ ఎ. శరత్ మాట్లాడుతూ, పీఎం కుసుమ్ పథకం కింద అమలవుతున్న సౌర విద్యుత్ ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. సౌర శక్తి వినియోగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయాలు మెరుగుపడతాయని, రైతులు శాశ్వతంగా లబ్ధి పొందుతారని తెలిపారు. ఇందిరా సౌర గిరి జలవికాసం పథకం కింద బోర్లు వేయడానికి తగిన ప్రదేశాలను శాస్త్రీయ పద్ధతిలో గుర్తించాలని ఆదేశించారు. భూగర్భ జలాల లభ్యత, భూసర్వే నివేదికలు, రైతుల సాగు అవసరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని సాంకేతిక నిపుణుల సూచనలతో బోర్లు వేయాలని ఆయన సూచించారు.జిల్లాలో మహిళా సంఘాల ద్వారా రెండు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి మరియు మణుగూరు మండలం ఉడతనేని గుంపులో స్థలాలు కేటాయించబడ్డాయని, వీటి స్థాపనకు అవసరమైన చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.రాష్ట్రవ్యాప్తంగా మోడల్ సోలార్ గ్రామాలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యంతో 80 గ్రామాలను గుర్తించారని, అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గండుగుల పల్లి గ్రామాన్ని ఆదర్శ సోలార్ గ్రామంగా అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. గ్రామంలో అన్ని ఇళ్లకు సోలార్ సదుపాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.అదేవిధంగా, ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ ఎ. శరత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా ప్రభుత్వ భవనాల విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాక, అవి పర్యావరణానికి అనుకూల నమూనాలుగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో, పీఎం సూర్య ఘర్ పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని ఛైర్మన్ ఎ. శరత్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా విద్యుత్ శాఖ అధికారి మహేందర్, టి జి ఆర్ జి డి సి ఓ జిల్లా మేనేజర్ రాజేందర్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :