Wednesday, 16 September 2026 09:16:42 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

చెక్కు బౌన్స్ కేసుల ప్రత్యేక లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొండి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్

Date : 05 May 2025 07:34 PM Views : 895

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం: బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, ఇతరులు వేసిన చెక్కు బౌన్స్ కేసుల పరిష్కారం కొరకు ప్రత్యేక లోక్ అదాలత్ వచ్చే నెల 9 నుండి 14 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, చైర్మన్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కొత్తగూడెం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా ఈనెల 5 నుండి 19 వరకు ముందస్తు లోక్ అదాలత్ ను జిల్లాలోని అన్ని కోర్టులలో నిర్వహిస్తామన్నారు. కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ మాట్లాడుతు ప్రత్యేక లోక్ అదాలత్ లలో ఇరువర్గాలు కానీ కేసులలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి గానీ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థను సంప్రదించి మేము కేసు రాజీ పరుచుకుంటామని తెలిపితే న్యాయ సేవా అధికార సంస్థ వారు అందుకు సంబంధించిన కేసు వివరాలు తెలుసుకొంటారన్నారు. వారి కేసు ఏ కోర్టులో ఉన్న జిల్లా న్యాయ సేవ అధికార సంస్థకు తెప్పించుకొని ఆ కేసులలో ఉన్న ఇరవర్గాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థకి పిలిపించి ఇరువర్గాల సమక్షంలో గానీ వారి న్యాయవాదుల సమక్షంలో గానీ లేదా మధ్యవర్తిత్వం నిర్వహించి వారికి ఆమోదయోగ్యమైన పరిష్కారము కనుగొనేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఇరువురి సమక్షంలో రాజీ వివరాలను రాతపూర్వకంగా రాసి ఇరు వర్గాలకి అవార్డు రూపంలో కేసు పూర్తయినట్టుగా అవార్డు కాపీని తక్షణమే అందజేసేందుకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కృషి చేస్తుందన్నారు. పై ప్రత్యేక లోక్ అదాలతులలో ఎవరైనా కక్షిదారులు డబ్బులు పూర్తిగా చెల్లించాటానికి సిద్ధంగా లేకపోయినట్లయితే కేసు వేసిన వ్యక్తిని ఒప్పించి కొన్ని వాయిదాలలో చెక్ అమౌంట్ చెల్లించేలా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన మధ్యవర్తులు కృషి చేస్తారన్నారు. కావున చెక్కు బౌన్స్ కేసుల ప్రత్యేక లోక్ అదాలత్ లన్ని పైన సూచించిన తేదీలలో సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు విజ్ఞప్తి చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :