తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లాభాల ప్రకటనలో యాజమాన్య నిర్ణయం పై గుర్తింపు సంఘం ఆగ్రహం సింగరేణి లో మితిమీరిన సర్కార్ రాజకీయజోక్యం తో కార్మికులకు తీవ్ర నష్టం కలుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన గుర్తింపు సంఘం ఎఐటియుసి గుర్తింపు సంఘం ఎఐటియుసి ఆధ్వర్యం లో పీవీకే5 లో గురువారం ఉదయం గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశం లో ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వి మల్లికార్జున్ రావు మాట్లాడుతూ సింగరేణి వార్షిక లాభాల వాటా విషయం లో ప్రభుత్వం,యాజమాన్యం కలిసి కార్మికులను మోసం చేసింది అని అన్నారు,గడిచిన 2024-2025 ఆర్ధిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలు 6400 కోట్లు రూపాయలు నికరంగా సంస్థకు రాగా నాలుగువేల కోట్ల రూపాయలు సంస్థ అభివృద్ధికై పక్కన పెట్టడం రాజకీయ కుట్రనే అని వివరించారు,మిగిలిన 2360 కోట్ల రూపాయల నుండి కార్మికులకు 34శాతం వాటాగా 819కోట్ల రూపాయల ప్రకటించారు అని గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అధిక లాభాలు వచ్చిన సరే కార్మికులకు మాత్రం పంచిన వాటా తగ్గింది అని ఇది రాష్ట్ర ప్రభుత్వం,యాజమాన్యం కలిసి కార్మికులను మోసం చేసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు,దిన్ని గుర్తింపు సంఘం ఎఐటియుసి గా తీవ్రంగా ఖండించాం అని వివరించారు,అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం 10000 రూపాయలు ఇవ్వాలి అని గుర్తింపు సంఘం డిమాండ్ చేయగా వారికి 5500 రూపాయలు ఇచ్చి వారిని కూడా అవుమానపరిచారు అని అన్నారు,అదేవిధంగా సింగరేణి కార్మికులు ఏడుకుంటున్న ప్రధాన సమస్యలు పేర్క్స్ పై టాక్స్ యాజమాన్యమే భరించాలి అని కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చి ప్రతి కార్మికుడికి 20లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి అని,మారుపేర్ల సమస్య ను పరిష్కరించాలి అని అనేకసార్లు ప్రభుత్వనికి,యాజమాన్యానికి గుర్తింపు సంఘం ఎఐటియుసి ఆధ్వర్యం లో మెమొరాండంలు ఇచ్చిన కానీ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది అని అన్నారు,కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని త్వరగా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేపడతాం అని యాజమాన్యాన్ని హెచ్చరించారు.అదేవిధంగా ఎఐటియుసి చేస్తున్న పోరాటాలు చూసి ఆకర్షితులు అవుతున్న యువ కార్మికులు యూనియన్ లో చేరుతున్నారని ఈ రోజు పీవీకే5 లో అమన్ అనే ఫిట్టర్ నీ బ్రాంచ్ కార్యదర్శి కండువా కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు,సమావేశం లో సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జీ వీరాస్వామి,వైస్ ప్రెసిడెంట్ కత్తర్ల రాములు,పీవీకే5 పిట్ కార్యదర్శి హుమాయూన్,ఆఫీస్ బ్యారర్స్ సందబోయినా శ్రీనివాస్, ఏరియా స్టోర్స్ పిట్ కార్యదర్శి కమల్,సీనియర్ నాయకులు కుర్రు రమేష్, భుక్య రమేష్,సాయి పవన్, రామచందర్,కుమారకృష్ణ, కుమార్,మరియు తాతిదారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ