Wednesday, 16 September 2026 07:38:20 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కాళోజీ ఆశయాలను భావితరాలకు అందించాలి. ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం : జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 09 September 2026 05:11 PM Views : 55

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం : జిల్లా కలెక్టర్ అంకిత్.తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతికి కాళోజీ విశిష్ట సేవలు.కాళోజీ ఆశయాలను భావితరాలకు అందించాలి ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంకిత్, కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కాళోజీ నారాయణరావు తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి, సామాజిక చైతన్యానికి విశిష్ట సేవలు అందించారని తెలిపారు. కాళోజీ కేవలం కవి మాత్రమే కాకుండా సామాజిక ఉద్యమకారుడిగా, ప్రజా చైతన్యవేత్తగా తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ మాండలిక భాషలో సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ, సాధారణ ప్రజల జీవితాలు, వారి కష్టాలు, ఆశలు, ఆకాంక్షలను తన రచనల్లో ప్రతిబింబించినందుకే ఆయనకు ప్రజాకవి అనే బిరుదు లభించిందని అన్నారు.కాళోజీ రచనలు ప్రజల్లో ధైర్యాన్ని, సామాజిక అవగాహనను, చైతన్యాన్ని పెంపొందించాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తన కవిత్వం ద్వారా సమాజం ముందుకు తీసుకువచ్చి మార్పు కోసం కృషి చేశారని గుర్తుచేశారు. సమాజంలోని అన్యాయాలు, అసమానతలపై తన రచనల ద్వారా గళమెత్తిన కాళోజీ ఆలోచనలు నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు.కాళోజీ నారాయణరావు సేవలను గుర్తించి ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించడం గర్వకారణమని కలెక్టర్ అన్నారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఆయనకు లభించిన అత్యున్నత గౌరవమని పేర్కొన్నారు.ప్రతి సంవత్సరం కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ భాష, సాహిత్యం, సంప్రదాయాలు, సంస్కృతిపై ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా యువత కాళోజీ రచనలు, ఆయన జీవితం, ప్రజా ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్రను తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ భాషా వైభవాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, కాళోజీ చూపిన ప్రజా చైతన్య మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మావతి, కలెక్టరేట్ ఏఓ అనంత రామకృష్ణ, సీపీఓ సునీత, ఓఎస్డీ వెంకటరమణతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :