తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వట్టికొండ రజిని జయంతి సందర్భంగా గౌతమ్ పూర్ లోపేదలకు నిత్యావసర సరుకులు, కొత్త బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిరుపేద కుటుంబాలకు బియ్యం, కిరాణా సరుకులు, దుస్తులను అందజేశారు.ఈ సందర్భంగా కొత్తగూడెం ఏఐటియుసి ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వట్టికొండ మల్లికార్జున్ మాట్లాడుతూ, వట్టికొండ రజిని ఆశయాలను స్మరించుకుంటూ సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రుద్రంపూర్ ఉపసర్పంచ్ తోటరాజు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ