తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వెంకటేష్ గని కోల్ మైన్ సింగరేణి కార్మికులతో నడిపించాలి..కాపుకృష్ణ. రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) వెంకటేష్ గని కోల్ మైన్ లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ ఆధ్వర్యంలో గని అడిషనల్ మేనేజర్ అనిల్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వికే సీఎం కోల్ మైన్ ను సింగరేణి కార్మికులతో బొగ్గు తవ్వకాలు నిర్వహించాలని, సత్తుపల్లికి డిప్యూటేషన్ పై వెళ్లిన వారందరిని వెంటనే వీ కే కోల్ మైన్ కు తీసుకురావాలని మెమొరాండం ఇవ్వడం జరిగింది. కాపు కృష్ణ మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల అబద్ధపు మాటలు చెప్పి గెలిచినా రెండు యూనియన్లు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మరచి ట్రాన్స్ఫర్ డిప్యూటేషన్ పైరావిలకు పరిమితం అయ్యారని ఎవరికి నచ్చిన వారికి డిప్యూటేషన్ మీద నచ్చిన ప్రాంతాలకు పంపిస్తున్నారని, గత వంద సంవత్సారాల నుండి సింగరేణి ద్వారా కొత్తగూడెం ప్రాంతంలో సింగరేణి కార్మికులతో బొగ్గు తవ్వకాలు చేస్తన్నారని కొత్తగా ప్రారంభమైన వెంకటేష్ కోల్ మైన్ లో బొగ్గును ప్రెవేటు వారితో తవ్వకాలు చేయుట కొరకు సింగరేణి యాజమాన్యం ప్రయత్నలు చేస్తున్నారని ప్రైవేటు వారికి అప్పజెప్పడం వలన కొత్తగూడెం ప్రాంతంలో సింగరేణి కార్మికులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయని రాబోయే నాలుగైదు సంవత్సరాలలో పివికే మైన్ కూడా బంద్ అవుతుందని వికే కోల్ మైన్ ను సింగరేణి కార్మికులతో నడిపితే పీవీకే వాళ్లందర్నీ కూడా ఇక్కడ వికే సీఎం లో ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని గతంలో మాదిరిగా మెడికల్ బోర్డు నిర్వహించి బోర్డకు పోయిన వారందరిని అన్పిట్ చేయాలని అన్నారు. మేనేజర్ కి మెమోరాండం ఇచ్చిన వారిలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, సెంట్రల్ కమిటీ మెంబర్ కాగితపు విజయ్ కుమార్, పిట్ సెక్రటరిలు జిఎస్ శ్రీనివాసరావు, ఆంజనేయులు,బ్రాంచ్ సెక్రటరీ రాజ్ కుమార్, సంతోష్, వెంకటేష్, కోటేశ్వరరావు, ప్రకాష్ సిఐటియు నాయకులు శ్రీరామ్ మూర్తి టీబీజీకేఎస్ నాయకులు కార్మిక సోదరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ