Wednesday, 04 November 2026 04:31:47 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని మంత్రి వాకిటి శ్రీహరికి ఆహ్వానం

Date : 14 March 2026 01:15 PM Views : 496

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిని కలిసి ఆహ్వానించిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో, అర్చకుల బృందం మంత్రి దంపతులను మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించిన ఆలయ అర్చకులు బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానపత్రికను మంత్రి వాకిటి శ్రీహరికి అందజేసిన ఆలయ ఈవో రాబోయే మార్చి 27న జరిగే శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు హజరుకావాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి *వాకిటి శ్రీహరి*ని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో,ఆలయ అర్చకుల బృందం ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణలతో మంత్రి వాకిటి శ్రీహరి దంపతులను ఆశీర్వదించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆధ్యాత్మిక వేడుక అని ఆలయ అధికారులు తెలిపారు. ఆహ్వానాన్ని స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరి భద్రాచలం శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. మంత్రిని ఆహ్వానించిన వారిలో భద్రాచలం ఆలయం ఈవో దామోదర్‌, ఆలయ ఉప ప్రధానార్చకులు శ్రీనివాస రామానుజం, రామాయణంపారాయణుడు అంతర్వేదికృష్ణమాచార్య, AEO భవానీ రామకృష్ణలు ఉన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :