Thursday, 05 November 2026 03:57:13 PM
# బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న 19 మంది సురక్షితం. # సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్.

నంబర్ ప్లేట్లు లేని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నంబర్ ప్లేట్ల వాహనాలపై ప్రత్యేక డ్రైవ్

Date : 15 July 2026 02:07 PM Views : 677

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో నంబర్ ప్లేట్ నిబంధనల ఉల్లంఘనులపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు: 36 కేసులు నమోదు, రూ.7,510 జరిమానా విధింపు ​ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు ఈ రోజు ఉదయం ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్న వాహనాలే లక్ష్యంగా ఈ డ్రైవ్ కొనసాగింది. ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా నిబంధనలను ఉల్లంఘించిన మొత్తం 36 వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేసి, రూ. 7,510/- జరిమానా విధించి వసూలు చేశారు. ​ఈ సందర్భంగా కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, వాహన యజమానులు అందరూ తమ వాహనాలకు నిబంధనలకు అనుగుణంగా స్పష్టంగా కనిపించే నంబర్ ప్లేట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నంబర్ ప్లేట్లను వక్రీకరించడం, అంకెలను మార్చడం లేదా స్పష్టంగా కనిపించకుండా చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని, ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా వాహన యజమానులు తమ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను సక్రమంగా ఉంచుకోవడంతో పాటు, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. పట్టణంలో రోడ్డు భద్రతను పటిష్టం చేయడానికి ఇటువంటి డ్రైవ్ లు నిరంతరం చేపడుతామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :