తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటర్లందరికీ ముఖ్యమైన గమనిక!ప్రతి ఒక్కరి ఓటు హక్కు మన ప్రజాస్వామ్యానికి పునాది. ఈ నెల 27వ తేదీ గురువారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించబడతాయి.గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈ సభలు జరుగుతాయి.ఈ సభల్లో బూత్ లెవల్ అధికారులు, అంటే బీఎల్‌ఓలు, ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల సమక్షంలో చదివి వినిపిస్తారు.కాబట్టి ప్రతి ఓటరూ ఈ సభకు హాజరై, ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోండి.మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోండి...మీ ఓటు హక్కును కాపాడుకోండి...ప్రజాస్వామ్యంలో మీ భాగస్వామ్యాన్ని చాటుకోండి! జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ