Thursday, 05 November 2026 11:59:55 PM
# ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన 15 రోజుల్లో పూర్తి చేయాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి. # స్మశానవాటికల పరిశుభ్రతకు మేయర్ గణేష్ ఆదేశం. # గ్రాడ్యుయేట్ల ఓటు నమోదు ముమ్మరం చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # మురుసు తుఫాన్‌ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ డిమాండ్. # భద్రాద్రి కొత్తగూడెంలో ఐఎఫ్‌ఎంఐఎస్ జిల్లా స్థాయి శిక్షణ విజయవంతం. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులకు సువర్ణావకాశం: భారత్ హ్యుందాయ్‌లో ఉద్యోగాల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు! # శాశ్వత పనులతో జిల్లాను మోడల్‌గా నిలపాలి: మంత్రి తుమ్మల. # తుపాను నష్టంపై మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష. # తుఫాను నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా . # బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న 19 మంది సురక్షితం. # సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు

గిరిజన ప్రాంతాల్లో ఉత్తమ వైద్య సేవలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు - భద్రాద్రి కొత్తగూడెం టీవీవీపీ ఆసుపత్రులకు అత్యధిక అవార్డులు

Date : 07 April 2026 03:56 PM Views : 299

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రకటించిన అవార్డుల్లో గిరిజన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం విశిష్ట స్థానం సంపాదించింది. జిల్లా డీసీహెచ్‌ఎస్ డా. రవి బాబు పరిధిలోని వైద్య విధాన పరిషత్ (TVVP) ఆసుపత్రులు అత్యధిక అవార్డులు సాధించడం విశేషం. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన, సమయోచిత వైద్య సేవలు అందించడంలో చూపిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఈ రోజు అవార్డుల ప్రదానం హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా, కమిషనర్ ఫ్యామిలీ & హెల్త్ శ్రీమతి సంగీత, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ , హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు విభాగాధిపతులు పాల్గొన్నారు. ఈ అవార్డులు అందుకున్న వారిలో CHC పాల్వంచకు చెందిన డా. శైలేష్ కుమార్ (CAS-ఆర్థో), డా. పి. రామ్ ప్రసాద్ (DYCS-అనస్తీషియా), ఏరియా హాస్పిటల్ భద్రాచలం నుంచి డా. క్రపా విజయ్ (DYCS-పెడియాట్రిక్స్), నర్సింగ్ ఆఫీసర్ శ్రీమతి కృష్ణవేణి, ABAS సేవలలో ఎ. వెంకట రావు (98%), అలాగే ల్యాబ్ సేవల విభాగంలో భద్రాచలం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ కృష్ణ ఉన్నారు. ఏరియా హాస్పిటల్ మనుగూరు నుంచి నర్సింగ్ ఆఫీసర్ శ్రీమతి మానస , సీఎంఎస్ ఇంచార్జ్ ఫార్మాసిస్ట్ గ్రేడ్–I శ్రీమతి ఏ. శారధ అవార్డులు అందుకున్నారు. అదనంగా భద్రాచలం, మనుగూరు, చర్ల వంటి గిరిజన ప్రాంతాల్లో ఉత్తమ సేవలు అందించినందుకు “బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ట్రైబల్ ఏరియా” విభాగంలో డీ సి హెచ్ ఎస్ డాక్టర్ జి రవి బాబు మూడు అవార్డులు ఆయా సూపరింటెండెంట్లు అయిన రామ కృష్ణ,గౌరీప్రసాద్, సాయి వర్ధన్ లతో కలిసి అందుకున్నారు.. జిల్లా టీవీవీపీ ఆసుపత్రులు ఇప్పటికే పలు సందర్భాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు పొందగా, ఈ అవార్డులు గిరిజన ప్రజలకు అందిస్తున్న ఉత్తమ వైద్య సేవలకు మరో గొప్ప గుర్తింపుగా నిలిచాయి

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :