తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో విబి-జి రామ్ జి పథకం ద్వారా తాత్కాలిక పనులకు స్వస్తి చెప్పి, ప్రజలకు ఉపయోగపడే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద చెరువుల పూడికతీత, గ్రామీణ రహదారులు, పాఠశాల గదుల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.మురసు తుపాను వల్ల దెబ్బతిన్న పంటలు, రహదారులు, విద్యుత్ వ్యవస్థను త్వరితగతిన పునరుద్ధరించాలని సూచించారు. ముఖ్యంగా ములకలపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వచ్చే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు, వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ