తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐక్యత, సుఖసంతోషాలతో పండుగ వేడుకలు జరుపుకుందాం మండపాల వద్ద పారిశుద్ధ్యం, విద్యుత్ విస్తృతంగా చేపట్టాలి ఉత్సావాల సందర్బంగా గట్టి బందోబస్తు కల్పించాలి : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఐక్యతతో, సుఖసంతోషాల నడుమ కలిసిమెలిసి జరుపుకోవాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ఆకాంక్షించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఆదివారం ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలు, బస్తీలు, ప్రధాన కూడళ్లలో పెద్దఎత్తున ప్రతిష్టించిన వినాయక మండపాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మండపాల పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు నిరంతరం పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని, చెత్తాచెదారం పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని, రాత్రి వేళల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. అలాగే భక్తులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించేలా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ