Friday, 18 September 2026 08:12:57 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

గిరిజన గ్రామాల అభివృద్ధికి శాఖల మధ్య సమన్వయం కీలకం. జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 27 May 2026 07:35 PM Views : 175

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరిజన గ్రామాల అభివృద్ధికి శాఖల మధ్య సమన్వయం కీలకం : జిల్లా కలెక్టర్ అంకిత్.గిరిజన ప్రాంతాల అభివృద్ధి అధికారుల బాధ్యత : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి : పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.జిల్లాలోని భద్రాచల, పినపాక నియోజకవర్గాలలో నెలకొన్న అటవీ, రెవెన్యూ భూ సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ అటవీ అనుమతులపై జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన భద్రాచలం ఐ టీ డి ఏ నందు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట రావు , పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు , జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, ఐటిడిఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భద్రాచలం, పినపాక నియోజకవర్గాలలో వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు అవసరమైన అటవీ అనుమతులు, భూసేకరణ, డీఎల్సీ అనుమతులు, పోడు సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో అటవీ, రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన అటవీ అనుమతులు, భూసేకరణ, డీఎల్సీ అనుమతులు వంటి అంశాలు ఎక్కువకాలం పెండింగ్‌లో ఉండకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి శాఖ అధికారి తమ పరిధిలోని సమస్యలను ప్రతినెల సమీక్షిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. గిరిజన ప్రాంతాలలో రహదారులు, విద్యుత్, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాల పనులు ఆలస్యం కాకుండా చూడాలని సూచించారు.వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, మండల సమాఖ్య భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించిన భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు, డీఎల్సీ అనుమతులకు సంబంధించిన పెండింగ్ కేసులను ప్రత్యేకంగా పరిశీలించి అర్హులైన గిరిజనులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు .భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మాట్లాడుతూ చర్ల, దుమ్ముగూడెం మండలాలలో రహదారులు, విద్యుత్, త్రాగునీరు తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన అనుమతులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించడం అధికారుల బాధ్యత అని అన్నారు . అర్హులైన గిరిజన రైతులకు పోడు పట్టాలు మంజూరు చేయడంతో పాటు వెదురు మొక్కలు అందించి వ్యవసాయం చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. గిరిజనుల అభివృద్ధికి వారికి రహదారులు విద్యుత్ వంటి సదుపాయాలు కల్పించడానికి ప్రతి అధికారి కృషి చేయాలన్నారు.పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంలో ఐటిడిఏ పరిధిలో సుమారు రూ.28.39 కోట్ల అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్ శాఖలో రూ.6.50 కోట్ల పనులు, ఆర్ అండ్ బి శాఖ పరిధిలో సుమారు రూ.67 కోట్ల అభివృద్ధి పనులు అటవీ అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. భూసేకరణ, క్రీడా స్థలాలు, మండల సమాఖ్య భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పోడు పట్టాలు పొందిన రైతులకు బోర్‌వెల్ అనుమతులు కూడా ఇవ్వాలని కోరుతూ, గిరిజనుల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో 58 శాతం అటవీ ప్రాంతం ఉన్నందున, ప్రతి అభివృద్ధి పనిలో అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి అయినవి అని,సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. అటవీ భూములను పరిరక్షిస్తూ గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు . ఇలాంటి సమన్వయ సమావేశాలు ప్రతి నెల నిర్వహించడం ద్వారా సమస్యలను సమయానుకూలంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు. అటవీ శాఖ ద్వారా ఇవ్వవలసిన అనుమతులు చట్ట ప్రకారం త్వరితగతిన లభించేలా అటవీ సంపద వన్య ప్రాణుల సంరక్షణ చేస్తూ పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు.ఐటిడిఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారానికే ఈ సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి వారం నిర్వహిస్తున్న గిరిజన దర్బార్‌కు పోడు సమస్యలపై అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారని చెప్పారు. పోడు పట్టాల్లో పేర్ల పొరపాట్లు, పాస్‌బుక్స్ అందకపోవడం, డీఎల్సీ అనుమతులు వచ్చినా పట్టాలు జారీ కాకపోవడం, సర్వే జరగని రైతులు, బోర్‌వెల్ మరియు విద్యుత్ లైన్ అనుమతులు పెండింగ్‌లో ఉండటం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. అర్హులైన గిరిజనులకు మాత్రమే పోడు పట్టాలు అందేలా, పదేళ్లకు పైగా సాగు చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.పోడు రైతులకు బోర్‌వెల్, విద్యుత్ అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కోరిన ఆయన, ఇప్పటివరకు 1076 దరఖాస్తులను అటవీ శాఖకు పంపగా 254 మందికి అనుమతులు లభించాయని తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, జిల్లాలో 31 అభివృద్ధి పనులకు సంబంధించి విద్యుత్ శాఖ ఫామ్-ఏ సమర్పించిన వెంటనే అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలని సూచించారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డిఆర్ఓ పద్మావతి ఇంజనీరింగ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, అటవీ, ఐటీడీఏ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :