తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని, నిత్యా అన్నదానంలో భాగంగా ఈరోజు జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రముఖ వ్యాపారవేత్త, వసుంధర టెక్స్టైల్స్ అధినేత, తాటిపల్లి గ్రూప్స్ చైర్మన్ తాటిపల్లి శంకర్ బాబు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మండపంలో నిత్యం అన్నదానం నిర్వహించడం అభినందనీయమని కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు స్థానిక వార్డు సభ్యులు శ్రీనగర్ కాలనీ మాజీ ఉప సర్పంచ్ లగడపాటి రమేష్, చంద్, అన్నవరపు విద్యా సాగర్, ఫారెస్ట్ వెంకటేశ్వరావు, కిషన్ రావు, వట్టికొండ. సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ