తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచ పట్టణంలోని అల్లూరి సెంటర్ లోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రూ. లక్ష నగదు విలువైన గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయని బాధితులు వాపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇంట్లో నివాసం ఉంటున్న ట్రాన్స్ జెండర్లు భిక్షాటనతో జీవనం సాగిస్తున్నామని, సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ