తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలల్లో భాగంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీములో ఉన్నటువంటి 500 రూపాయలతో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథనికి సంబంధించిన ధ్రువపత్రాల పంపిణీని 10వ వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ ప్రారంభించారు. శనివారం స్థానిక పదో వార్డులో ధ్రువపత్రాల పంపిణీ ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీలు పథకం ప్రజలు సంతోషించదగ్గ విషయమైనప్పటికీ గ్యాస్ సబ్సిడీ ,200 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీ సబ్సిడీ అందరికీ సక్రమంగా పడేటట్లు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజా పాలనలో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీములలో మిగతా స్కీములైన రేషన్ కార్డులు, వృద్ధాప్య ,వితంతు, వికలాంగుల పెన్షన్స్ ,అంబేద్కర్ అభయహస్తం, ప్రతి ఇంట్లో ఒక మహిళకు 2500రూ .. గృహలక్ష్మి పథకాన్ని వెంటనే ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టు చర్యలు చేపట్టాలని మునిగడప పద్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు భాను జానకి మేడిపల్లి కవిత,బొంతు కుశలన , ఖాజా మూవీనిద్దీన్, తమ్మ బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ