Wednesday, 16 September 2026 08:29:06 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

షరతులు లేకుండా తక్షణమే ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయాలి, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చండ్ర నరేంద్ర కుమార్

Date : 08 May 2026 04:15 PM Views : 337

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మే 9 తెలుగు వెలుగు ) : జూలూరుపాడులో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యం లో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షాలకు తడుస్తున్నటువంటి వరి ధాన్యం మొక్కజొన్నలు తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సొసైటీ కొనుగోలు కేంద్రం ఎదుట జరిగిన ధర్నాను ఉద్దేశించి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలలో వేలాది బస్తాలు ధాన్యం, మొక్కజొన్నలు ములుగుతోందని అన్నారు. నిబంధనల మేరకు కొనుగోలు కేంద్రాన్ని తీసుకొచ్చిన పంటను తేమ శాతం ఎక్కువగా ఉందని, తాలు ఎక్కువగా, రంగు మారింది అంటూ అధికారులు పలు విధాలుగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.. పంట వివరాలను నమోదు చేయడానికి యాప్ మూసివేశారని, దీనిపై అవగాహన లేక పంట వివరాలు నమోదు చేయలేదని తెలిపారు. అధికారులు రైతు యాప్ ను నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు... ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సక్రమంగా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారని అన్నారు. దీనిని అవకాశం గా తీసుకున్న పలువురు ప్రైవేట్ వ్యాపారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నిలువునా ముంచుతున్నారని మండిపడ్డారు. ఒకవైపు అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు, మరోవైపు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి పంట నష్టం జరుగుతుందని అన్నదాతలు ఆగమాగం అవుతున్నారని, కొనుగోలు కేంద్రాల వద్ద రాత్రి పగలు లేకుండా వర్షం పడుతుందేమో అని కాపు కాయాల్సి వస్తుంది దీనివల్ల రైతులు కూడా ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో ఘోరంగా విఫలం చెందుతుందని విమర్శించారు.. ఇకనైనా షరతులు లేకుండా రైతులు పండించిన మొత్తం పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా జరుగుతున్న ప్రాథమిక సహకార రైతు సంఘం కార్యాలయం వద్దకు మండల తహసిల్దార్ టి శ్రీనివాసరావు రైతు సంఘం నాయకులతో మాట్లాడి ధర్నాను విరమింప చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యాస రోశయ్య, ఎల్లంకి మధు తూము కోటయ్య సిరిపురపు వెంకటేశ్వర్లు గార్లపాటి వీరభద్రం ఎల్లంకి శీను వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :