తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం తరఫున అందుతున్న వైద్య సహాయంపై ప్రత్యేక దృష్టి సారించారు.ములకలపల్లి మండల కేంద్రానికి చెందిన గట్టిగొర్ల మహాలక్ష్మమ్మ చండ్రుగొండ మండలం అన్నారంతండా కు చెందిన బానోత్ దినేష్ అత్యవసర వైద్య చికిత్సల నిమిత్తం ప్రభుత్వం నుంచి చెరొక రూ.2.50 లక్షల చొప్పున మొత్తం రూ.5 లక్షల LOC చెక్కులను స్వయంగా అందజేశారు.అనంతరం అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన ఇనుముల లక్ష్మయ్య, అన్నపురెడ్డిపల్లి మండలం బుచ్చన్నగూడెం గ్రామానికి చెందిన పామర్తి సుస్మిత, దమ్మపేట మండలం లచ్చాపురం దిబ్బగూడెం గ్రామానికి చెందిన గురింద గోపాలరావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ