Saturday, 19 September 2026 04:20:33 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

Date : 27 March 2026 03:07 PM Views : 519

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : సిఎం ఎనుముల రేవంత్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొని పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పణ భక్తుల తాకిడితో కిక్కిరిసిన భద్రాద్రి క్షేత్రం రూ. 351 కోట్లతో ఆలయ విస్తరణ తొలిదశ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహణ భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సతీ సమేతంగా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. భద్రాచలం మిథిలా స్టేడియంలో నిర్వహించిన శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం వేలాది భక్తుల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి దంపతులు స్వామి, అమ్మ వార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మిథిలా స్టేడియంలో శ్రీ రామచంద్రస్వామి, సీతమ్మ వారికి పూజా కార్యక్రమం, అలంకరణ, తదితర కార్యక్రమాలు నిర్వహించి పెళ్లి కొనసాగించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు, వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలను నిర్వహించారు. భద్రాచలం ఆలయం సర్వాంగ సుందరంగా అలంకరించబడగా, భక్తుల రాక పోకలతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దర్శనం కోసం భారీగా తరలివచ్చి దర్శనం పొందారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. త్రాగునీరు, అన్న ప్రసాదం, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించు కున్నారు. అనంతరం ఆలయం వద్ద 351 కోట్లతో చేపట్టిన ఆలయ అభివృద్ధి తొలిదశ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఎంపీ పోరిక బలరాం నాయక్, న్యాయమూర్తులు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా అయ్యర్, ఎండోమెంట్ కమీషనర్ హన్మంత రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, పీఓ బి. రాహుల్, అదనపు కలెక్టర్లు విద్యా చందన, వేణుగోపాల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు, లక్షలాది మంది భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :