తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 7,605 మంది విద్యార్థులు కేటాయించగా, 7,435 మంది హాజరయ్యారు, 170 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల సందర్భంగా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షలు సజావుగా సాగినట్లు ఆయన తెలిపారు. తదుపరి రోజు పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు .
Admin
తెలుగు వెలుగు టీవీ