Wednesday, 16 September 2026 09:48:37 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 19వ తేదీ శుక్రవారం రోజున అన్ని డివిజన్లో జిఎం ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది.

Date : 22 September 2025 05:57 PM Views : 492

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణికి 2024_25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లాభాలను ప్రకటించడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 19వ తేదీ శుక్రవారం రోజున అన్ని డివిజన్లో జిఎం ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరై ధర్నాలో నిరసన తెలియజేయడం ద్వారా కార్మికులలో ఉన్న వ్యతిరేకతను గ్రహించి ప్రభుత్వం యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం నాయకులతో చర్చించటానికి సానుకూలంగా స్పందించడం వలన 20వ తేదీ శనివారం రోజున ముఖ్యమంత్రి గారిని యూనియన్ నాయకులను కలవటం జరిగింది. ఈ సమావేశంలో సింగరేణికి వచ్చిన లాభాలను ప్రకటించడంతో పాటుగా సింగరేణిలో ముఖ్యమైన సమస్యలు కార్పొరేట్ మెడికల్ బోర్డు సమస్య, సొంత ఇంటి పథకం అమలు చేయాలని, సింగరేణిలో నూతన ప్రాజెక్టులను తీసుకోవడం గురించి మారుపేర్ల సమస్య , పెరిక్స్ మీద టాక్స్ చెల్లించడం గురించి మొదలగు సమస్యల మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు అన్ని సమస్యలు విని సానుకూలంగా స్పందించి ఈ విషయాలపై ముఖ్యంగా కంపెనీ లాభాల గురించి ఉపముఖ్యమంత్రి గారితో సమస్త చైర్మన్ తో సాయంత్రం వెళ్లి మాట్లాడండి అని నేను వాళ్లకి సూచన చేస్తానని నాయకులతో చెప్పడం జరిగింది.శనివారం సాయంత్రమే ఉపముఖ్యమంత్రి గారిని చైర్మన్ గారితో కలిసి ఈ సమస్యలపై మాట్లాడటానికి ప్రయత్నం చేసిన యూనియన్ నాయకులను తప్పుదోవ పట్టించి శనివారం ఆదివారం చర్చలు జరపకుండా సోమవారం రోజు 22వ తేదీన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏకపక్షంగా కంపెనీకి వచ్చిన లాభాల్లోంచి 4వేల కోట్ల రూపాయలు ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం కేటాయిస్తున్నామని కేవలం 2360 కోట్ల రూపాయలు మాత్రమే గత ఆర్థిక సంవత్సరానికి లాభాలు వచ్చింది అని ప్రకటించడం అందులో 34% వాటాన్ని ప్రకటించడం జరిగింది , 2023-24 ఆర్థిక సమస్యకు వచ్చిన లాభాలలో సుమారు 2000 కోట్ల రూపాయలు ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం తీసిన యాజమాన్యం ఈ సంవత్సరం అనగా 2024 _25 ఆర్థిక సంవత్సరానికి ₹4,034 కోట్ల రూపాయలు ఫ్యూచర్ ప్రాజెక్టులను తీయడం విడ్డూరం.(గత సంవత్సరం తీసిన సుమారు రెండు వేల కోట్లారుపాయలను ఎక్కడ ఖర్చు పెట్టారో తెలపకుండ మరియు ఈ సంవత్సరం కూడా నాలుగు వేలకోట్లారుపయలు ఎక్కడ కర్చుపెడతారో వివరణ ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది.ఈ నిర్ణయం పై గుర్తింపు కార్మిక సంఘం గా మేము తీవ్రంగా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ వీ సీతారామయ్య, అడిషనల్ జనరల్ సెక్రెటరీ మిరియాల రంగయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కే. సారయ్యకే. కే. వీరభద్రయ్య, వైవి రావు, మడ్డి ఎల్లయ్య, కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ .ప్రకాష్, కేంద్ర కార్యదర్శిలు అక్బర్ అలీ, వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శిలు SK. బాజీ సైదా, సలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్, ఎస్. తిరుపతి, జిగురు రవీందర్, వై. రాంగోపాల్, రమణారావు, డిటి రావు, నాయకులు కొట్టే కిషన్ రావు, మోత్కూరి కొమరయ్య, సుదర్శన్, క్రాంతి , రాంనర్సయ్య, రంగు శ్రీనివాస్, కాంటాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుర్ర తిరుపతి, బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :