Friday, 18 September 2026 11:55:26 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 07 March 2025 06:46 PM Views : 967

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ మండలం పాత పాల్వంచ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలను ఆకస్మికంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మధ్యాహ్న భోజన మెనూను పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో భోజనం చేస్తూ కలెక్టర్ వారితో మమేకమై వారి బాగోగులను మరియు భోజనం పై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఆహారాన్ని తీసుకునే ముందు చేతులను సబ్బుతో పరిశుభ్రంగా కడగాలని ఆయన సూచించారు. ఆహారాన్ని వదిలివేయరాదని, చక్కని ఆరోగ్యానికి ఆహారం సహకరిస్తుందని ఆయన చెప్పారు. పౌష్టిక ఆహారం పట్ల అవగాహన పెంచుకోవాలని, పౌష్టికాహారాన్ని ముఖ్యంగా బాలికలు విధిగా తీసుకోవాలని కలెక్టర్‌ బోధించారు. ఆహార పదార్థాలను వృధా చేయరాదని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని కోరారు. ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను బాగా గ్రహించాలని అందుకు ఏకాగ్రత అవసరమని కలెక్టర్‌ అన్నారు. పాఠ్యాంశాలలో సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ వంట వండే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాత్రలను ప్రతిరోజూ శుభ్రం చేయాలని సూచించారు. మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని తెలిపారు.చిన్నారులకు అందించే భోజనం నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. పాఠశాలకు మంజూరైన స్పోర్ట్స్ మెటీరియల్ కిట్లను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలను సరళతరం చేసేందుకు, అనుకూలంగా భోజనం చేసేందుకు వీలుగా కిచెన్ సెట్, ఐరన్ పొయ్యి ఏర్పాటు, బల్లలు, బెంచీలు మరియు విద్యార్థులకు ప్రత్యేకంగా లంచ్ బాక్స్ తో కూడిన బ్యాగ్ ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి, నివేదికలు అందించాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, జిల్లా కోఆర్డినేటర్ సైదులు, సతీష్ కుమార్, ఎంఈఓ రామ్మూర్తి, ప్రధానోపాధ్యాయురాలు పద్మలత, మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :