Friday, 18 September 2026 01:11:44 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఏజన్సీ ప్రాంతంలోవెనుకబడిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి

Date : 07 January 2026 05:41 PM Views : 338

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 7 తెలుగు వెలుగు) : ఏజన్సీ ప్రాంతంలో నివసిస్తున్న దళితులు ఇతర వెనుక బడిన వర్గాలకు త్వరలో జరగబోయే ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అమలు చేయాలని మోదుగు జోగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. జులూరుపాడు మండల కేంద్రంలోని,ఏ.వి.ఆర్. ఫంక్షన్ హాల్ లో ఏజన్సీ దళితుల ఐక్యవేదిక హక్కుల సమితి రాష్ట్ర నాయకులు,రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకులు వేల్పుల నరసింహరావు అధ్యక్షతన జరిగిన విలేకర్ల సమావేశంలో ఏజన్సీ దళితుల రిజర్వేషన్ పెంపు పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోదుగు.జోగారావు మాట్లాడుతూ ఏజన్సీ ప్రాంతంలో 1937 లోనే బ్రిటిష్ ప్రభుత్వం దళితులను కొండ గిరిజనులుగా గుర్తించి 5% రిజర్వేషన్ అమలు చేసిందని గుర్తు చేసినారు. భారత దేశానికి స్వాతంత్ర్యం అనంతరం, డా.బి.ఆర్.అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన 15% రిజర్వేషన్ ఏజన్సీ ప్రాంతంలో అమలు జరగపోవడం ఈ ప్రాంతంలోని దళితులకు విద్య,ఉద్యోగ,రాజకీయ రంగాలలో తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపినారు.కన్యాకుమారి నుంచి కాశ్మిర్ వరకు భారత రాజ్యాంగ రిజర్వేషన్ అమలు జరుగుతుందని తెలిపినారు. కానీ ఏజన్సీ ప్రాంతంలో 15% రిజర్వేషన్ అమలు చేయాలని మంత్రులకు,అధికారులకు ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చిన అమలుకు నోచుకోలేదని అసహనం వ్యక్తం చేసినారు. ధర్నాలు, రాస్తారోకులు, ఎం.ఆర్.ఓ.,ఆర్.డి.ఓ. కలెక్టరేట్ కార్యాలయాలలో ధర్నాలు, వినతి పత్రాలు ఇచ్చి వేడుకున్న,ప్రభుత్వాలు 15% రిజర్వేషన్ అమలు చేయలేదని, అసలు చలించలేదని తెలిపినారు.ఈ తీవ్రమైన అన్యాయం పై గడ్డం.శ్రీరామ్,వేల్పుల. నరసింహారావు సహకారంతో హై కోర్టును ఆశ్రహించగా ఈ నెల 27 లోపు ఏజన్సీ ప్రాంతంలో 15% రిజర్వేషన్ అమలుకై, వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారిచేసిందని తెలిపినారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హై కోర్టు కు వివరణ ఇచ్చి ,ఏజన్సీ ప్రాంతంలో దళితులకు 15% రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ, వచ్చే లోకల్ ఎం.పి.టి., జడ్.పి.టి.సి.ఎన్నికలో 15% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఈ విలేకర్ల సమావేశంలో దళిత సంఘాల నాయకులు ఇళంగి. సుందర్ రావు,నాయి భ్రహ్మణ నాయకులు వళ్ళోజీ. రమేష్,బి.సి.సంఘం నాయకులు ముదిగొండ. వెంటప్పయ్య,దళిత సంఘాల నాయకులు ఉబ్బపల్లి. సంజీవరావు, పూర్ణకంటి. కృష్ణయ్య, కారుమంచి.సాయిబ్ తదితరులు పాలుగోన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :