తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హెలిపాడ్ వద్ద ఆహ్వానం పలికిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి, క్లాప్ కొట్టి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి కోమటిరెడ్డి కి ఎంపీ ఆర్ఆర్ఆర్ తో కలిసి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు హెలిపాడ్ వద్ద ఆహ్వానం పలికి శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని, హీరో పునీత్ శివరాజ్ కుమార్ దంపతులు, నిర్మాత నల్లారి సురేష్ రెడ్డి, దర్శకుడు పరమేష్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని, వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ