Wednesday, 04 November 2026 09:07:03 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సాధారణ ఎన్నికల పరిశీలకుడు సర్వేశ్వర్ రెడ్డి

Date : 01 December 2025 06:25 PM Views : 214

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సాధారణ ఎన్నికల పరిశీలకుడు, గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ వి. సర్వేశ్వర్ రెడ్డి సోమవారం పాల్వంచ మండల పరిధిలోని జీపీ ఉల్వనూర్, జీపీ బంజరా, జీపీ సత్యనారాయణ పురం మరియు జీపీ కోడిపుంజులవగు గ్రామపంచాయతీలను సందర్శించారు. సందర్శన సందర్భంగా నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను ఆయన పరిశీలించి, నామినేషన్ ప్రక్రియ ఎటువంటి అంతరాయం లేకుండా పారదర్శకంగా, సజావుగా సాగేందుకు అధికారులు అన్ని విధాలా చురుకుగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు సులభతరం కావడానికి హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి, అవసరమైన మార్గదర్శకాలు సమయానుకూలంగా అందించాలని, నామినేషన్ సమర్పణ సమయంలో అధికారులు మరియు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అలాగే ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు, చట్టవ్యవస్థకు భంగం కలిగే సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుని, ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో శాంతియుత, నియంత్రిత వాతావరణం నెలకొనేలా చూడాలని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో పాల్వంచ ఎంపీడీవో, ATDO చంద్ర మోహన్ దమ్మపేట, ఇతర విభాగాధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :