Wednesday, 16 September 2026 06:52:45 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 17 August 2026 07:20 PM Views : 90

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ముసాయిదా ఓటర్ల జాబితా–2026 ప్రచురణ .జిల్లాలోని 1,127 పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ . ఓటర్లు తమ పేరు, వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి.సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు అవకాశం.అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా–2026ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అంకిత్ సోమవారం విడుదల చేశారు. జిల్లాలోని మొత్తం 1,127 పోలింగ్ కేంద్రాల్లో ప్రజల పరిశీలన కోసం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు ఆయన తెలిపారు. సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (EROలు), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (AEROలు) కార్యాలయాల పరిధిలో కూడా ముసాయిదా ఓటర్ల జాబితా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు .జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 27 మండలాలు ఉన్నాయని, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 8,63,413 మంది జనరల్ ఎలక్టర్లు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. వీరిలో 4,19,558 మంది పురుషులు, 4,43,805 మంది మహిళలు, 50 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని వివరించారు. అదేవిధంగా 28 మంది NRI ఎలక్టర్లు, 723 మంది సర్వీస్ ఓటర్లు నమోదై ఉన్నారని, అన్ని కేటగిరీలను కలిపి జిల్లాలో మొత్తం 8,64,164 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 110-పినపాక (ST) నియోజకవర్గంలో 1,74,854 మంది జనరల్ ఎలక్టర్లు, 2 మంది NRI ఎలక్టర్లు, 197 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 111-ఇల్లెందు (ST) నియోజకవర్గంలో 1,94,860 మంది జనరల్ ఎలక్టర్లు, 4 మంది NRI ఎలక్టర్లు, 274 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 117-కొత్తగూడెం నియోజకవర్గంలో 2,15,639 మంది జనరల్ ఎలక్టర్లు, 14 మంది NRI ఎలక్టర్లు, 152 మంది సర్వీస్ ఓటర్లు, 118-అశ్వారావుపేట (ST) నియోజకవర్గంలో 1,44,770 మంది జనరల్ ఎలక్టర్లు, 6 మంది NRI ఎలక్టర్లు, 50 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు వివరించారు. 119-భద్రాచలం (ST) నియోజకవర్గంలో 1,33,290 మంది జనరల్ ఎలక్టర్లు, 2 మంది NRI ఎలక్టర్లు, 50 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఓటరు తప్పనిసరిగా పరిశీలించుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఓటరు పేరు జాబితాలో లేకపోవడం, ఓటరు వివరాల్లో ఏదైనా తప్పు లేదా పొరపాటు ఉండటం, అర్హత లేని వ్యక్తి పేరు ఓటర్ల జాబితాలో నమోదై ఉండటం వంటి అంశాలను గుర్తించినట్లయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలను 17.08.2026 నుంచి 16.09.2026 వరకు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. నిర్ణీత గడువులో సంబంధిత ERO/AERO అధికారులకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో పేరు చేర్పు, తొలగింపు లేదా వివరాల సవరణకు సంబంధించి అవసరమైన దరఖాస్తులను సంబంధిత ERO/AERO/BLOలను సంప్రదించి సమర్పించాలని సూచించారు.ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు లేకపోవడం, ఓటరు వివరాల్లో ఏదైనా తప్పు ఉండటం లేదా అర్హత లేని వ్యక్తి పేరు నమోదై ఉండటం వంటి అంశాలపై ప్రజలు నిర్ణీత గడువులో అభ్యంతరాలు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు అవసరమైన సహాయం కోసం సంబంధిత ERO/AERO/BLOలను సంప్రదించవచ్చని తెలిపారు.అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, ఓటర్ల వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా ఉండేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపడుతున్నారని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి, అవసరమైన సందర్భాల్లో నిర్ణీత గడువులోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సమర్పించాలని ఆయన కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :