Thursday, 17 September 2026 07:36:43 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

సమిష్టిగా రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు కృషి చేద్దాం : ఎస్పీ రోహిత్ రాజు

Date : 03 January 2026 05:04 PM Views : 367

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : స్కూళ్లు,కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల కొరకు ఉపయోగించే వాహనాల ఫిట్ నెస్ పై దృష్టి సారించాలి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖాధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎస్పీ రోహిత్ రాజు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు - 2026 లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకై పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు.శనివారం నాడు ఎస్పీ కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు.జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరగనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ముందుగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ నిర్దిష్ట సైన్ బోర్డులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.వాహనదారులందరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించే విధంగా నిత్యం వాహన తనిఖీలు చేపట్టి అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు.ముఖ్యంగా స్కూళ్లు,కాలేజీలకు విద్యార్థులను తరలించడానికి ఉపయోగించే బస్సులు,వాహనాల విషయంలో ఖచ్చితమైన నియమ,నిబంధనలను పాటించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై,ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై నిత్యం వాహన తనిఖీలు నిర్వహించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.పొగమంచు కారణంగా ప్రమాదాలు జరగకుండా వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ప్రభుత్వ,ప్రయివేట్ బస్సుల ఫిట్ నెస్ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్బి ఇన్స్పెక్టర్ సీహెచ్.శ్రీనివాస్,డీసిఆర్బీ ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనివాస్,మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్స్ వి.వెంకటరమణ,డి.మనోహర్,అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్స్ ఫారుక్,రాజశేఖర్ రెడ్డి,అశోక్,రాకేష్,శ్వేత,మానస తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :