తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌లో శనివారం ఉదయం 10 గంటలకు S-20 గదిలో ఒరియెంటేషన్ మరియు ఎంపిక పరీక్ష నిర్వహించారు. డ్రాయింగ్ టెస్ట్ మరియు ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా మూడు నెలల రెసిడెన్షియల్ మల్టీపర్పస్ అసిస్టెంట్ – ఫర్నిచర్ ప్రొడక్షన్ అండ్ ఇన్‌స్టాలేషన్ కోర్సుకు అభ్యర్థులను ఎంపిక చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేశ్ వీ. పాటిల్ యువత ఈ శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని నైపుణ్యంతో ముందుకు సాగాలని సూచించారు.రాజమండ్రిలో సోమవారం ప్రారంభమయ్యే ఈ శిక్షణ కోసం మొత్తం 11 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.శిక్షణ పొందనున్న వారికి కల్పించే సదుపాయాలు: ప్రతి అభ్యర్థికి ₹5,000 రిజిస్ట్రేషన్ ఫీజు ను జిల్లా యంత్రాంగం భరిస్తుంది.వసతి మరియు భోజనం పూర్తిగా ఉచితంగా కల్పించబడుతుంది.శిక్షణ పూర్తయ్యిన తర్వాత ₹15,000/- నెల వేతనంతో 6 నెలల అప్రెంటిస్‌షిప్ అవకాశం ఉంటుంది, అనంతరం 100% ప్లేస్‌మెంట్ అవకాశాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.NSTI–FFSC ఆధ్వర్యంలో జరిగిన మొదటి విడతలో 8 మంది శిక్షణ పూర్తి చేసి ప్రస్తుతం అప్రెంటిస్‌షిప్‌లో ఉన్నారు. రెండవ విడతలో 19 మంది అభ్యర్థులు ఇప్పటికే ఎంపికయ్యారు.జిల్లా యువత ఈ శిక్షణ అవకాశాన్ని ఉత్సాహంగా వినియోగించుకుంటున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య ఏపీఎం, సైదేశ్, ఈడియం, దిలీప్, నందు, ర్యాంపు కోఆర్డినేటర్స్, జేఆర్పీలు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ