తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చరిత్ర తెలుసుకోలేనివాడు చరిత్రను సృష్టించలేడు 16 వ డివిజన్లోని జై భీమ్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం 16వ డివిజన్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం రామవరం బస్టాండ్ సెంటర్లో ఉన్న జై భీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ జెండాను,లక్ష్మీ టాకీస్ ఏరియా బస్తీవసులు ఏర్పాటుచేసిన జాతీయ జెండాలను ముఖ్య అతిథిగా విచ్చేసిన 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్న విద్యావ్యవస్థను పాలకులు విచ్ఛిన్నం చేయడం వల్ల మనకు స్వేచ్ఛ వాయువులు అందించిన జాతీయ నాయకుల త్యాగాలను మనం తెలుసుకోవాలి చరిత్ర తెలుసుకోలేని వాడు చరిత్రను సృష్టించ లేరని ఆమె అన్నారు.గత జాతీయ నాయకుల చరిత్ర పాఠ్యపుస్తకాలలో లేకపోవడం వల్ల చరిత్ర గమనం నేటి తరానికి తెలియటం లేదని ఆమె అన్నారు. మతాలకతీతంగా పోరాటాలు చేసిన గత నాయకుల చరిత్రలు పాఠాలుగా మన భావితరాలకు నేర్పించాలని ఆమె పేర్కొన్నారు. మన బాధ్యతలను, నీతి నిజాయితీ తో నిర్వర్తించాలని అన్నారు.అదే ఈనాడు మన స్వతంత్ర భారతావని కిచ్చే నిజమైన గౌరవం అని అన్నారు. వర్తక సంఘం, జాతీయ రహదారిలోని గత లాల్ బహుదూర్ శాస్త్రి ఏరియా, కొత్తగూడెం కార్పొరేషన్ ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జై భీమ్ నాయకులు దొబ్బేటి గురుమూర్తి,తొ గరు రాజశేఖర్, పోచంపల్లి సురేష్, సావటి స్వామి, కొరివి సురేష్,, తాళ్ల నగేష్ , సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఫయుం, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్,న్యాయవాది మునిగడప వెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఖయ్యూం, ఎస్కే జలీల్, రసూల్ నాయకులు భద్రక్క, కొమరమ్మ, షబానా, మదనమ్మ, శిరీష, సైనా, మయూరినిస, జయ,,గౌస్, కిరణ్, వేణు,అబ్దుల్లా, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ