తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చేపల పెంపకంతో బహుళ ప్రయోజనాలు. కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని సుజాతనగర్ మండలం, సింగభూపాలెం చెరువులో మత్యశాఖ మంజూరు చేసిన 74100 చేపపిల్లలను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగాసీతారాములు కలిసి చేప పిల్లలను చెరువులోకి విడుదల చేశారు . అనంతరం ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు జీవనాధారంగా నిలుస్తాయని, చేపల పెంపకం ద్వారా రైతులు, మత్స్యకారులు ఆర్థికంగా బలపడతారని అన్నారు. ప్రతి చెరువు సజీవంగా ఉండేలా సంబంధిత శాఖల అధికారులు తమవంతు భాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మత్యశాఖ జిల్లా అధికారి అహ్మద్ ఇంతియాజ్ ఖాన్, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపిడివో భారతి, వ్యవసాయశాఖ అధికారిని నర్మదా, వివిధశాఖల అధికారులు , కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు ,సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా,కాంగ్రెస్ , సిపిఐ నాయకులు , స్థానికులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ