Monday, 03 August 2026 10:44:28 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 06 June 2026 07:44 PM Views : 110

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కౌన్సిల్ సమావేశాల్లో ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి.ప్రజాసేవకు, సమస్యల పరిస్కారానికి కార్పొరేటర్లు అంకితం కావాలి.బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ పార్టీ ప్రతిష్టను పెంచాలి.బస్తీల వారీగా స్థానిక సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారానికి కృషి చేయాలి.ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రణాళికాబద్ధంగా కార్పొరేషన్ అభివృద్ధికి బాటలు వేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై గళమెత్తాలి.అధిక ధరలకు నిరసనగా ఈనెల 10న జరిగే కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి. కౌన్సిల్ సమావేశాల్లో ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సిపిఐ పక్ష కార్పొరేటర్ల సమావేశం కొత్తగూడెం శాసనసభ సభ్యుల వారి కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సిపిఐ పక్ష కార్పొరేటర్లు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పౌర సేవలు అందించాలని సూచించారు. రాబోయే కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేస్తూ, ప్రజాసమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు ముందుండాలన్నారు. పట్టణంలోని ప్రతి వార్డు పరిధిలో నెలకొన్న డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాల వంటి సమస్యలను గుర్తించి వాటి తక్షణ పరిష్కారానికి మున్సిపల్ అధికారులతో కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల వల్ల సామాన్యులపై భారం పడుతోందని, నిత్యావసర వస్తువుల అధిక ధరలకు నిరసనగా ఈనెల 10వ తేదీన చేపట్టనున్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కార్పొరేటర్లు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన వివరించారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, మేయర్ మూడ్ గణేష్, కార్పొరేటర్లు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :