తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్21 (తెలుగువెలుగు)జూలూరుపాడు మండల పరిధిలో ఉన్న కుంటలు, చెరువులు కొన్ని ఆక్రమణకు గురవుతున్నవి అదే కాకుండా అసలు మండలంలో ఉన్నటువంటి చెరువులు కుంటలకు సరిహద్దులు లేకపోవడం అక్రమార్కులకు అదునుగా అనిపిస్తూ అందిన కాడికి ఆక్రమించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇలా ప్రతి ఒక్కరు కుంటలను చెరువులను ఆక్రమించుకుంటూ పోతే మునుముందు చెరువులు కుంటలు అనేవి లేక భూగర్భ జలాలు అంతరించిపోయే పరిస్థితి ఉన్నది అలా జరిగితే మండల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జూలూరుపాడు బీఎస్పీ మండల అధ్యక్షుడు తంబర్ల నరసింహారావు ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందించడం జరిగినది .
Admin
తెలుగు వెలుగు టీవీ