తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు జేఏసీ నిర్వహించినటువంటి బందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం జిల్లా మాజీ అధ్యక్షులు కె.వి రంగా కిరణ్ మాట్లాడుతూ బీజేపీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని. బీసీల పట్ల సవతి తల్లి ప్రేమను చూపుతూ అమలుకాని హామీలు ఇచ్చి బీసీలను మోసగించిన కాంగ్రెస్ పార్టీ , ఇప్పుడు వాళ్ల చేతగాని తనాన్ని బీజేపీ పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే 42% బీసీ రిజర్వేషన్ వ్యవహారంలో అసలు దొంగ కాంగ్రెస్ అని నిరూపించేలా, బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ బంద్ కార్యక్రమంలో పాల్గొని బంద్ సహకరించకుండా తెరిచి ఉంచిన పలు కార్యాలయాలను మరియు షాపులను రంగా కిరణ్ గారు మరియు కార్యకర్తలు కలిసి మూసివేయడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ