తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంటిలిజెన్స్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కలిగి విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి , అసాధారణ ప్రతిభ కనబరిచిన జూలూరుపాడు మండల ఇంటిలిజెన్సీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ముల్లపాటి మురళి ని ఉమ్మడి ఖమ్మం జిల్లా అడిషనల్ ఎస్పీ(RIO) రామోజీ రమేష్ అభినందిస్తూ నగదును బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా రామోజీ రమేష్ మాట్లాడుతూ పోలీసు వృత్తి కేవలం విధినిర్వహణ మాత్రమే కాదని, అదొక సామాజిక బాధ్యతగా గుర్తు చేస్తూ పోలీసులు సమాజం పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనభరిచిన మురళిని సహఉద్యోగులు, ఉన్నతాధికారులు అభినందించారు
Admin
తెలుగు వెలుగు టీవీ