తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 12 (తెలుగు వెలుగు) : పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితమిచ్చిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల జూలూరుపాడు ప్రెస్ క్లబ్ సీనియర్స్ జర్నలిస్ట్లు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వనజీవి రామయ్య 'వృక్షో రక్షతి రక్షితః' అనే నినాదంతో కోట్లాది మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణలో వెలకట్టలేని సేవలు అందించారన్నారు. ఆయన హరితయాత్ర దశాబ్దాల కాలంగా కొనసాగిందన్నారు. ఆయన మృతితో పర్యావరణ ఉద్యమానికి తీరని లోటు అని వారు పేర్కొన్నారు. వనజీవి రామయ్య సేవలు చరిత్ర లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. పలు సేవ కార్యక్రమాల్లో వారు పాలు పంచుకున్నారని, . వనజీవి రామయ్య తన జీవితాన్ని పచ్చదనానికి అంకితం చేసి, యావత్తు ప్రపంచానికి స్పూర్తిదాయకంగా నిలిచారని వారి సేవలను గుర్తు చేసుకుంటూ, కుటుంబ సభ్యులకు జర్నలిస్టు మిత్రులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ