Monday, 03 August 2026 12:26:30 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు.

Date : 10 June 2026 07:17 PM Views : 913

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న స్నేహితులు తమ మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచి స్నేహబంధం, మానవత్వాన్ని చాటుకున్నారు. శ్రీ రామచంద్ర పాఠశాల 10వ తరగతి (1994–95 బ్యాచ్) విద్యార్థులలో ఒకరైన పంది శివకుమార్ ఆకస్మిక మరణంతో తోటి మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.శివకుమార్ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో బ్యాచ్‌కు చెందిన మిత్రులు కలిసి రూ.1,02,000లను సేకరించి కుటుంబ సభ్యులకు అందజేశారు. గత కొంతకాలంగా శివకుమార్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం భారీగా ఖర్చు చేసినట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండటంతో వారి విద్యాభ్యాసం, ఇతర అవసరాలకు ఈ సహాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.గాజుల రాజం బస్తీలోని శివకుమార్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి గడ్డం శాంతి ప్రియ చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, చిన్ననాటి స్నేహితుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమని, శివకుమార్ లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా తమ వంతు సహకారం అందిస్తూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గడ్డం సతీష్ కుమార్, యెర్రా లింగేష్, వేణు, తోట రమేష్, జక్కుల విజయ్, ఆలూరి మురళి, బొబ్బల వెంకట్, అక్తర్, జి. రాంచందర్, మంగ రాంచందర్, అచ్చి నాగరాజు, కంచర్ల సతీష్, పప్పు సురేష్, శివ, ముంతాజ్ తదితర మిత్రులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :